28.7 C
Hyderabad
Sunday, April 19, 2026
spot_img

షర్మిల కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు

విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడంతో వైసీటీపీ అధ్యక్షురాలు షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో షర్మిల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అడ్డుకున్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ షర్మిల పట్ల పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని న్యాయమూర్తికి చెప్పారు. ఓ ఎస్సై తనను చేతితో తాకే ప్రయత్నం చేశారని.. పోలీసులు తనను అడ్డుకొని కొట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం తాను పోలీసులను పక్కకు తోసేశాను అని పేర్కొన్నారు.

ఇక పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసులపై చేయి చేసుకోవడం వల్ల సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందన్నారు. షర్మిల తన కారు డ్రైవర్‌ను వేగంగా పోనివ్వని చెప్పడంతో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కాలికి గాయాలయ్యాయని వ్యాఖ్యానించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్