23.7 C
Hyderabad
Friday, November 15, 2024
spot_img

హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎక్స్‌ వేదికగా స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో బీజేపీకి ఎదురుగాలి వీచిందని… రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయని విమర్శలు గుప్పించారు. 5, 6 దశలలో జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్‌కి కలిపి జరిగిన ఆంధ్రాలో ఈవీఎంలు ట్యాంపర్‌ చేశారని ఆరోపించారు.

ఏపీలో ఎన్నికలు జరిగిన మూడు నెలల తరువాత ఈసీ ఫామ్ 20ని వెబ్‌సైట్‌లో పెట్టిందన్న ఎంపీ.. దీని గురించి మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకు వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేశారని మండిపడ్డారు. ఫామ్ 20 వివరాలు బయటకి రాగానే తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెరమీదికి తీసుకొచ్చిందని విమర్శించారు. వాళ్ల కుట్రలో భాగంగా పక్కా స్కెచ్‌తో దీన్ని మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నిజనిజాలతో ఎలాంటి పనీ లేదని, ఇది తిరుమల లడ్డూ నెయ్యి కోసమో, భగవంతుడి కోసమో మొదలు పెట్టింది కాదని,.. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి సృష్టించిన అరాచకమని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన ఆరు రోజుల తరువాత తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే తప్పుడు రిపోర్టును గుజరాత్‌కు చెందిన ఎన్డీడీబీ నుంచి తెప్పించి పెట్టుకున్నాడని విమర్శించారు. టీటీడీకి కొత్త పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడని ధ్వజమెత్తారు.

ప్రజలెవర ఏపీ ఎన్నికల ఫామ్ 20 గురించి మాట్లాడకుండా, బూత్ వారీ లెక్కలు గురించి విశ్లేషించకుండా ఉండటానికే లడ్డు, ప్రాయశ్చిత్త దీక్షలను తెర మీదికి తెచ్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇదీ స్థూలంగా జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. ఉదాహరణకు హిందూపురంలో ఓ వార్డులో వచ్చిన ఓట్ల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ వార్డులో వైసీపీకి ఒక ఓటు పడిందని.. టీడీపీ- 95, బీఎస్పీ- 5, కాంగ్రెస్- 464, అదే వార్డులో లోక్‌సభలో వైసీపీ- 472, కాంగ్రెస్- 1, టీడీపీ- 8, బీఎస్పీ- 83 ఓట్ల పడ్డాయని తెలుపుతూ ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు. ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగేనని చెప్పుకొచ్చారు. దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీచిందనేది స్పష్టంగా అర్థమైందని, రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయని సాయిరెడ్డి గుర్తు చేశారు. అయిదు, ఆరు దశల్లో జరిగిన రాష్ట్రాల్లో ముఖ్యంగా అసెంబ్లీకి లోక్‌సభకు కలిపి జరిగిన ఏపీలో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆయన వివరించారు.

ఇది చంద్రబాబు, లోకేష్, హరిప్రసాద్, టెర్రాసొఫ్ట్ మరి కొంతమంది కలిసి చేసిన కుట్ర అన్నారు విజయసాయిరెడ్డి. ఎన్నికల ముందు చంద్రబాబు జర్మనీ, దుబాయ్, లోకేష్ ఇటలీ, జర్మనీ, దుబాయ్ ప్రయాణాలు ఈ ఈవీఎంల టాంపరింగ్, డబ్బులు బదిలీ కోసమే అన్నది సుస్పష్టమన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు హిందూమతంపై కానీ, భగవంతుడిపై కానీ నమ్మకంలేదని.. వారి కులమే ఒక మతం అని నమ్మే వ్యక్తులని మండిపడ్డారు. చంద్రబాబుకు ఈ మోసాలు వెన్నతో పెట్టిన విద్య… అందరూ కలిసి ఈ అరాచకానికి తెరదీశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఈ దోపిడీదొంగల టీడీపీనేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Latest Articles

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సాయిదుర్గ తేజ్

సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా రిలీజై ఈ రోజుతో పదేళ్లవుతోంది. 2014, నవంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్