వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొన్న ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదల ప్రకారం డీకే అరుణకు సాదర స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయం అర్చకులు, కమిటీ సభ్యులు. అమ్మవారి ఆశీస్సులతో తాను ఎంపీగా గెలిచానని అరుణ చెప్పారు. మహిమ గల అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నా అన్నారు. రేణుకా ఎల్లమ్మ కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. 2047 కల్లా మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచాలన్న మోదీ సంకల్పం సిద్ధించేలా ఆశీర్వదించాలని రేణుకా ఎల్లమ్మను మొక్కుకున్నట్లుచెప్పారు.