పేదరికం నుంచి స్టార్‌గా మారి.. ప్రజల కోసం- ఇదీ విజయ్‌ ప్రస్థానం

తమిళ సినీ ప్రపంచంలో అగ్రహీరోగా ఎదిగి, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న దళపతి విజయ్‌( Thalapathy Vijay) వ్యక్తిగత జీవితం కూడా అంతే భావోద్వేగాలతో నిండిన ప్రయాణం. వెలుపల కనిపించే స్టార్ ఇమేజ్ వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు.

పేదరికం నుంచి ప్రారంభమైన జీవితం

1974 జూన్ 24న జన్మించిన విజయ్‌, చిన్ననాటి జీవితం అంత సులభంగా సాగలేదు. తల్లి శోభా చంద్రశేఖర్‌( Shoba Chandrasekhar) గాయని, తండ్రి చంద్రశేఖర్‌ (S. A. Chandrasekhar) దర్శకుడు. విజయ్‌ చిన్ననాటి సమయంలో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.

తొలినాళ్లలో ఒక చిన్న గదిలో, కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవించారు. బాత్రూమ్ కూడా లేని పరిస్థితుల్లో కుటుంబం గడిపిన రోజులు, విజయ్ చిన్ననాటి కష్టాలను చూపిస్తాయి. విజయ్‌కు ఏడేళ్లు వచ్చేవరకు ఆర్థికంగా ఆ కుటుంబం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది.

మార్పుకు నాంది – కుటుంబానికి తొలి విజయ కిరణం

తర్వాత విజయ్ తల్లిదండ్రులు కలిసి తీసిన సినిమా సత్తం ఓరు ఇరుట్టరై ( Sattam Oru Iruttarai). ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా విజయకాంత్‌ (Vijayakanth) నటించిన ఈ సినిమా, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చింది. ఈ విజయం తర్వాతే విజయ్ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది.

జీవితాన్ని మార్చిన విషాదం

అయితే, విజయ్ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చింది ఆయన సోదరి మరణం. తన చెల్లి విద్య అంటే విజయ్‌కు చాలా ఇష్టం. ఆమెతో ఆయనకు ఎంతో ఆత్మీయ బంధం ఉండేది. ఆమె మరణం విజయ్‌ను లోలోపల బాగా కుదిపేసింది. ఆ సంఘటన తర్వాత.. ముందు ఉన్న అల్లరి స్వభావం తగ్గింది. మితభాషిగా మారిపోయారు. లోలోపలే భావాలను దాచుకునే వ్యక్తిగా మారారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. తెరపై ఎంతో ఎనర్జీతో కనిపించే విజయ్‌, బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉండటానికి ఇదే కారణమని చెబుతుంటారు.

బయట కనిపించని వ్యక్తిత్వం

విజయ్‌ను అభిమానులు ఒక మాస్ హీరోగా చూస్తారు. డ్యాన్సులు, ఫైట్లు, స్టైల్‌తో ప్రేక్షకులను అలరించే నటుడిగా ఆయన గుర్తింపు ఉంది. కానీ వ్యక్తిగతంగా చాలా మౌనంగా ఉండే స్వభావం ఆయనది. వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టని ధోరణి కనిపిస్తుంటుంది. విజయ్‌ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

ఇవి ఆయన వ్యక్తిత్వంలోని ముఖ్య లక్షణాలు

విజయ్‌ విషయంలో వ్యక్తిగత అనుభవాలే రాజకీయ దిశకు మార్గం చూపించాయని అంటుంటారు. చిన్ననాటి కష్టాలు, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత నష్టాలు.. ఇవి అన్నీ విజయ్‌ను జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునేలా చేశాయి. ఈ అనుభవాలే ఆయనను ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకువచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. ఒక అల్లరి పిల్లవాడిగా ప్రారంభమైన జీవితం…ఒక మౌన స్వభావం గల స్టార్‌గా మారి… ఇప్పుడు ప్రజల కోసం పని చేయాలనుకునే నాయకుడిగా ఎదిగింది.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్