అవమానాల నుంచి ఆత్మవిశ్వాసం వరకు – టీవీకే చీఫ్ విజయ్‌ ప్రయాణం

సినిమా ప్రపంచంలో అవమానాలతో ప్రారంభమైన ఒక ప్రయాణం… కసి, పట్టుదల, నిరంతర సాధనతో అగ్రస్థానానికి చేరి… ఇప్పుడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్న నాయకుడిగా మారిన వ్యక్తి దళపతి విజయ్‌( Thalapathy Vijay).

అవమానాల నుంచి ఆత్మవిశ్వాసం వరకు – విజయ్‌ ప్రయాణం

ఒక సామాన్య యువకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన విజయ్‌కు మొదట్లో అవకాశాలు అంత సులభంగా రాలేదు. ఇతను హీరోలా కనిపించడంలేదు… నటుడిగా పనికిరాడు… అనే విమర్శలు ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి వచ్చింది.

అయితే, తన కుమారుడిపై నమ్మకం ఉంచిన తండ్రి చంద్రశేఖర్( S. A. Chandrasekhar), అప్పు చేసి అతనితో సినిమా తీశారు. అలా విజయ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

మొదటి అడుగు – నిరాశతో ప్రారంభం

విజయ్‌ తొలి చిత్రం- నాళయ తీర్పు( Naalaiya Theerpu)

ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితంగా తీవ్ర నిరాశకు గురైన విజయ్‌, కొంతకాలం బయటకు రావడానికే ఇష్టపడలేదు. అయితే, ఆయన స్నేహితులు ధైర్యం చెప్పడంతో మళ్లీ ముందుకు సాగారు.

సాధన – కొత్త విజయ్‌కు నాంది

తనను తాను నిరూపించుకోవాలనే తపనతో విజయ్‌ కఠిన సాధన ప్రారంభించారు. డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ, కరాటే నేర్చుకోవడం ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి, పగలు-రాత్రి కష్టపడి తనలోని లోపాలను సరిదిద్దుకున్నారు.

ఆ కృషి ఫలితంగా వచ్చిన చిత్రం రసిగన్‌ ( Rasigan). ఈ సినిమా విజయ్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చింది. ఒకప్పుడు విమర్శించినవాళ్లే ఆయనను ప్రశంసించడం ప్రారంభించారు.

స్టార్‌డమ్ – దళపతిగా ఎదిగిన హీరో

1990ల చివరలో, 2000ల ప్రారంభంలో విజయ్‌ తమిళ సినీ రంగాన్ని శాసించారు.

కుషీ (Kushi) గిల్లి(Ghilli) లాంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్నారు. ఈ సమయంలోనే అభిమానులు ఆయనను ఇళయ దళపతి గా పిలవడం ప్రారంభించారు. తర్వాత అదే దళపతిగా మారి ఆయనకు శాశ్వత గుర్తింపుగా నిలిచింది.

తర్వాతి కాలంలో మెర్సల్‌, (Mersal) (తెలుగులో ‘అదిరింది’), సర్కార్‌ (Sarkar) , విజిల్‌ (Bigil) మాస్టర్‌ (Master) … ఈ సినిమాలు ఆయనను మరింతగా ప్రజలకు దగ్గర చేశాయి.

రాజకీయాల్లోకి కొత్త అడుగు

సినిమాల్లో అపారమైన క్రేజ్ సంపాదించిన విజయ్‌, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతూ కొత్త దిశగా పయనిస్తున్నారు.

ఆయన స్థాపించిన పార్టీ:
తమిళ వెట్రి కళగం Tamilaga Vettri Kazhagam (TVK)

సినిమాల్లో అభిమానుల ప్రేమను పొందిన విజయ్‌, ఇప్పుడు ప్రజల సమస్యలపై స్వరంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒకప్పుడు పనికిరాడు అన్న విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి…నేడు కోట్ల మంది ఆశలు నెరవేర్చే నాయకుడిగా మారేందుకు సిద్ధమవుతున్నాడు. విజయ్‌ కథ కేవలం సినిమా కథ కాదు…అది పట్టుదల, ఆత్మవిశ్వాసం, మార్పు కోసం చేసిన ప్రయాణం.

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్