ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి – అభివృద్ధి, రాజకీయ అంశాలపై కీలక సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి( A. Revanth Reddy) ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, అలాగే పార్టీకి సంబంధించిన కీలక రాజకీయ అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా, కేంద్ర రహదారి రవాణా మంత్రి Nitin Gadkariతో సీఎం సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రాంతీయ రింగ్ రోడ్ (Triple R) పనుల వేగవంతంపై చర్చించడంతో పాటు, హైదరాబాద్–అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేకంగా వినతి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ అమలయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

ఇక రైల్వే రంగంలో కీలకంగా భావిస్తున్న కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా, రాష్ట్రానికి సంబంధించిన మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులపై కేంద్రంతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

సామాజిక సంక్షేమ పథకాలలో భాగంగా, ఇందిరమ్మ ఇండ్లు పథకానికి అదనపు నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం. పేదలకు గృహాలు అందించడంలో ఈ పథకం కీలకంగా మారనుంది.

అదే సమయంలో, గత ప్రభుత్వ కాలంలో చేపట్టిన కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై( Kaleshwaram Lift Irrigation Project)పై ఉన్న వివాదాల నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరపాలని సీఎం కోరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాజకీయంగా కూడా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ (Indian National Congress) అధిష్ఠాన నేతలను కలుసుకుని రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీ, భవిష్యత్ వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

ఈ పర్యటనతో తెలంగాణకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు, ప్రాజెక్ట్ ఆమోదాలు వచ్చే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్