వైసీసీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల టూర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల పవిత్ర దేవాలయమైన తిరుపతిని అపవిత్రం చేసి, ఘోర పాపానికి పాల్పడిన వ్యక్తి దర్శనానికి వెళ్తానని చెప్పడం సిగ్గు చేటని నిప్పులు చెరిగారు. మా దేవునిపై నమ్మకం లేకపోతే నువ్వు ఎందుకు షో పుటప్ రాజకీయాలు చేస్తున్నావని నిలదీశారు. మీరు దొరికితే హిందూ సమాజం చంపేంత కోపంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. హిందువులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మంచి మాట చెప్పారని.. హిందువులకు కూడా దేశవ్యాప్తంగా బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఆయన సమర్థించారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతాలకు చెందిన ఉద్యోగస్తులు ఉండరాదని.. వారిని గుర్తించడానికి సీఎం చంద్రబాబు టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.