తెలంగాణ సచివాలయంలో మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మిషన్ భగీరథకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ పథకానికి సంబంధి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని.. విధిగా ఈ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీళ్ల నాణ్యత ప్రజలకు వివరించేలా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి సదస్సులు నిర్వహించాలన్నారు. RO ప్లాంట్లు, బోర్ నీళ్ల మీద ప్రజలు ఆధార పడకుండా చూడాలన్నారు.