Manchu Manoj |మంచు కుటుంబంలో అన్నదమ్ములు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు పబ్లిక్ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ అయ్యారు. మంచు కుటుంబానికి సన్నిహితుడైన సారధి అనే వ్యక్తిని విష్ణు కొట్టడం దానిని వీడియో తీసి మనోజ్ సోషల్ మీడియాలో పెట్టడంతో మ్యాటర్ రచ్చ రచ్చ అయింది. మోహన్ బాబు ఎంట్రీతో బ్రదర్స్ మధ్య వివాదం కాస్త సద్గుమణిగింది. దీనిపై స్పందించిన విష్ణు.. ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే సాధారణ గొడవలే అని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో అమెరికా పోయెట్, ఫిలాసఫర్ సుజీ కసీమ్ కోట్స్‌ను మనోజ్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. ‘కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసీచూడనట్లు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే’.. ‘క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు’ అనే కోట్స్ పెట్టాడు. దీనికి మీరు బతకండి, ఇతరులను కూడా బతకనివ్వండి అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్ చూసిన కొంతమంది అభిమానులు మనోజ్(Manchu Manoj) కు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.