స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి దగ్గర తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో తుఫాన్ వాహనంలో ఉన్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Breaking: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
0
319
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


