డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని ఒక్కలిగల గురువు సూచన

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం పదవి విషయంలో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమ నాయకుడినే ముఖ్యమంత్రిగా ప్రకటించాలని వారి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ సీఎల్పీ సమావేశంలో సీఎం నిర్ణయాన్ని అధిష్టానానికే అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో వీరిద్దరిని హైకమాండ్ ఢిల్లీకి రావాలని పిలుపు పంపంచింది. ఈ క్రమంలో ఇద్దరు నేడు హస్తిన వెళ్లి అగ్రనేతలతో సమావేశం కానున్నారు.

ఇలాంటి తరుణంలో సీఎం పదవికి డీకే శివకుమార్ అర్హుడంటూ ఒక్కలిగల గురువు ఆది చంచనగిరి నిర్మలానందనాథ స్వామీజీ అధిష్టానానికి సూచించారు. ఆదివారం జరిగిన ఒక్కలిగల గురువుల సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్యలకు ఈ మేరకు విజ్ఞప్తి చేయాలని తీర్మానించినట్టు నిర్మలానంద తెలిపారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్