సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌ రైలు బోగీలు పెంపు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో రైల్వేశాఖ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రైలు ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తుండగా వాటిని 16కు పెంచింది. ఈనెల 17 నుంచి 16 బోగీలతో వందేభారత్ పట్టాలపై పరుగులు తీయనుంది. అలాగే రైలు బయల్దేరే వేళల్లో కూడా స్వల్ప మార్పులు చేసినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు తిరుపతికి బయలుదేరే ఈ రైలు మే17 నుంచి 6.15 నిమిషాలకు బయల్దేరనుంది. అలాగే నల్గొండకు ఉదయం 7.30గంటలకు.. గుంటూరుకు 9.40.. ఒంగోలు 11.10.. నెల్లూరు మధ్యాహ్నం 12.30.. తిరుపతికి 2.30 గంటలకు చేరుకుటుంది. అటు తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15గంటలకు సికింద్రాబాద్ బయల్దేరనుంది. బోగీలు పెరగడతో సీట్ల సంఖ్య కూడా 530 నుంచి 1036కి పెరగనుంది.

 

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్