స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్(CM KCR) బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లలో నాలుగు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. అందులో గోషామహల్(Goshamahal) నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. సీఎం కేసీఆర్ గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) స్పందించారు. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఉండాలనేది ఎంఐఎం ఆఫీసు నుంచే డిసైడ్ అవుతుందని రాజాసింగ్ చెప్పారు.
2018 ఎలక్షన్స్ లోనూ ఇలాగే జరిగిందన్నారు. ఎంఐఎం(MIM) సూచనతో తనపై ప్రేమ్ సింగ్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా తానే ఉంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుల ఆశీర్వాదం తనకే ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గోషామహల్ బీజేపీ కార్యకర్తలు రెడీ అయిపోవాలని పిలుపునిచ్చారు. ఇంకొక యుద్ధం స్టార్ట్ చేద్దాం.. బీఆర్ఎస్ గవర్నమెంట్ ను పీకి పడేద్దాం.. బీజేపీ గవర్నమెంట్ ను తెలంగాణలో తీసుకొద్దాం అంటూ పిలుపునిచ్చారు.