ఎన్నికల ఫలితాలు వెలువడి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించీ సాధించగానే కొల్లు రవీంద్ర అప్పుడే ఫీల్డ్‌లోకి దిగిపోయారు. ఆకస్మిక పర్యటనలతో ఆయన అధికారులను హడలెత్తి స్తున్నారు. ముందుగా మచిలీపట్నం హెడ్ వాటర్ వర్క్స్‌లో రవీంద్ర ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకో వాలని హెచ్చరించారు. హెడ్ వాటర్ వర్క్స్‌లో పలు లోపాలు గుర్తించినట్లు కొల్లు రవీంద్ర చెప్పారు. పంపింగ్ వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉందన్నారు. జోన్ల వారీగా ప్రతి రోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందిం చేందుకు చర్యలు తీసుకుంటామని కొల్లు తెలిపారు. రిజర్వాయర్లన్నింటినీ వినియోగంలోకి తీసుకొస్తా మని కొల్లు చెప్పారు.