కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. కేంద్రప్రభుత్వ అరాచకాలు మితిమీరుతున్నాయ్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఆగడాలను ప్రజల ముందుకు తెచ్చారు.

సీఎం కేసీఆర్ మీడియా సమావేశం:
దేశంలో కేంద్రప్రభుత్వ అరాచకాలు, ఆగడాలు చాలా మితిమీరుతూ పరాకాష్టకు చేరుకుంటున్నాయి. కారణం ఏంటంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనేక ముప్పుతిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు. చాలా రాష్ట్రాలలో చాలా సందర్భాలలో ఎక్కడెక్కడైతే నాన్ – బీజేపీ ప్రబుత్వాలు ఉన్నాయో.. వారాంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికపరమైన పరిమితులు విధించడం.. రకరకాల బాధలు పెట్టి వేధించడం అనేక రకాలైన దుర్మార్గాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుంది. ఇది యావత్తు దేశమంతా కూడా చూస్తుంది. ఇటీవల కాలంలో ఢిల్లీలో రెండ్ వింత సంఘటనలు జరిగాయి. ఢిల్లీలో వెరీ పాపులర్ పార్టీ ఆమ్ ఆద్మీ.. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో స్పెషల్ మూమెంట్ ను తెచ్చిన పార్టీకి ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు రాష్ట్రప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అద్భుతమైన విజయం సాధించింది. వింత సంఘటన ఏంటంటే.. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అక్కడ స్పష్టమైన ఆధిక్యతలో ఆమ్ ఆద్మీ గెలిచింది. దాన్ని ఎన్నోరకాలుగా బీజేపీ కూయుక్తులు చేసి.. ఒకటి ఉన్నదానిని విభజించి మూడు చేసిన బీజేపీని ప్రజలు తిరస్కరిచారు. గెలిచినటువంటి మేయర్ ను కూడా ఎన్నోరకాలుగా బీజేపీ ముప్పుతిప్పలు పెట్టింది. ఇదే పద్దతిలో మూడు సార్లు చాలా పాపులర్ ఓట్లతో రెండు జాతీయపార్టీలను మట్టి కలిపించి ఆమ్ ఆద్మీ గెలుపొందింది. చివరికి సుప్రీం కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా చాలా దుర్మార్గమైన పద్దతికి బీజేపీ పాల్పడింది. ఇలా సుప్రీం కోర్టుకుపోయి కోట్లాడి గెలిచినా కూడా.. మరో దుర్మాగానికి తెరలేపుతూ బీజేపీ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. చివరికి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కు కూడా అతీగతీ లేకపోతే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చాయి అంటూ వివరించారు.

Latest Articles

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. నరహరి లొంగుబాటు

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అతని భార్య మేదర దానమ్మ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం. ఆయుధాలు, రాకెట్లు,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్