కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కడియం పార్టీకి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చినా..ఎందుకు మారారో చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డిపై గతంలో ఎన్నో ఆరోపణలు చేసి, ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి కండువా కప్పుకు న్నారని విమర్శించారు. కడియంకు నైతిక విలువలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాధపడొద్దని..బీఆర్ఎస్ త్వర లోనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ తోరణం తొలగిస్తే నామ రూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల ఊసే లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేశారు- హరీశ్‌రావు
0
174
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


