తనని డ్యాన్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారంటూ జరుగుతోన్న ప్రచారం అవాస్తవం అని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. తన పదవీ కాలం ముగియకుండానే సొంత నిర్ణయాలు తీసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నిర్ధారణ కాని ఆరోపణలను కారణంగా చూపిస్తూ తనను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్లు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తన పదవీ కాలం ఇంకా ఉందని చెప్పారు. అయితే అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు.