Minister KTR| నిరుద్యోగ మార్చ్.. తెలంగాణలో కాదు.. మోదీ ఇంటి ముందు చేయాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. ప్రతిపక్షాలు చెప్పే మాటలను నమ్మవద్దని యువతకు, నిరుద్యోగులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సమయంలో మోదీ.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఆ మాట ప్రకారం ఈ 9 ఏండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. సిగ్గు లేకుండా రాష్ట్రంలో ధర్నా చేస్తున్న బీజేపీ నాయకుల్లారా.. కనీసం 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా అంటూ బీజేపీ నాయకులను నిలదీశాడు. మీరు నిరుద్యోగ మార్చ్ చేయాలనుకుంటే ఇక్కడ కాదు, ఢిల్లీలోని నరేంద్ర మోదీ ఇంటి ముందు చేయాలని వ్యాఖ్యానించారు.