31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

రేపు సిట్‌ విచారణకు బండి సంజయ్‌ గైర్హాజరు

రేపు సిట్‌ విచారణకు బండి సంజయ్‌ గైర్హాజరు కానున్నారు. సంజయ్‌ తరపున సిట్‌ ఎదుట అతని లీగల్‌ టీమ్ హాజరుకానుంది. రేపు కర్నాటకలోని బీదర్‌లో జరిగే హైదరాబాద్‌ లిబరేషన్‌ వేడుకల్లో బండి సంజయ్‌ పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగా సిట్ ఎదుట గైర్హాజరు కానున్నారు బండి సంజయ్.

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం లీక్‌ అవడం.. అందులో భాగంగానే జగిత్యాల జిల్లాలోని ఒక మండలంలో 50 మందికిపైగా, ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అభ్యర్థులు అర్హత సాధించారని ఇటీవల బండి సంజయ్ ఆరోపించారు. ఈ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారిలో బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, సింగిల్‌ విండో చైర్మన్‌, సర్పంచ్‌ పిల్లలు, వారి బంధువులు ఉన్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సిట్‌.. సంజయ్‌కి 91 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వెంట తీసుకుని ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మంగళవారం బంజారాహిల్స్‌లోని బండి సంజయ్‌ ఇంటికి వచ్చిన సిట్‌ అధికారులు.. సంజయ్ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసు ప్రతులు అంటించి వెళ్లారు. అయితే బండి సంజయ్ హాజరు కాకపోవడంతో సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు బండి సంజయ్‌ ఇంటికి వెళ్లిన సిట్‌ ఇన్ స్పెక్టర్ అందజేశారు.

Latest Articles

గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్