పులివెందులలో ఆ ఇద్దరి నేతల ఫోటోలు లేకుండానే ఫ్లెక్సీ ఏర్పాటు

కడప జిల్లా అంటేనే వైఎస్ ఫ్యామిలీకి పెట్టింది పేరు. ఇక పులివెందుల అంటే ఆ ఫ్యామిలీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఏపీ సీఎం జగన్(Jagan) పులివెందుల నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ వైఎస్ ఫ్యామిలీ(YS Family)కి ఎంత మద్దతు ఉంటుందో. అలాంటిది మాజీ ఎంపీ వివేకానందరెడ్డి నాలుగవ వర్థంతి సందర్భంగా పులివెందులలో ఏర్పాటుచేసిన ఓ ఫ్లెక్సీ సంచలనంగా మారింది.

ఆ ఫ్లెక్సీలో సీఎం జగన్, ఎంపీ అవినాశ్ రెడ్ది(Avinash Reddy) ఫోటోలు లేకుండా కేవలం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మరో చెల్లి సునీత ఫొటోలు మాత్రమే ఉన్నాయి. వారి ఫోటోలే కాకుండా జగన్ తాత రాజారెడ్డి, తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు కూడా ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. కానీ జగన్, అవినాష్ రెడ్డి ఫొటోలు మాత్రం లేవు. దీంతో అందరూ ఈ ఫ్లెక్సీ చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్