స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అంతే కాదు మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపారానికి సంబంధించిన వివరాల సేకరణ చేస్తున్నారు ఐటీ అధికారులు. కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ ఇంట్లో కొనసాగుతున్నాయి సోదాలు. ఈ తరుణం లోనే ఐటీ అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు. అటు హైదరాబాద్ బడంగ్‌పేట్ మేయర్ పారిజాత ఇంట్లో ముగిసాయి ఐటీ సోదాలు. నిన్న ఉదయం నుంచి పారిజాత ఇంట్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ఈ నెల 6వ తేదీన ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ పారిజాత, నరసింహారెడ్డికి నోటీసులు ఇచ్చారు ఐటీ అధికారులు.
కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
0
422
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


