బ్యాంకులో ఓ డాలర్ దొంగతనం.. పోలీసులకు పట్టించాలని సిబ్బందికి వార్నింగ్

America |అమెరికాలోని ఓ బ్యాంకులో చేసిన దొంగతనం వైరల్ అవుతోంది. యూటా రాష్ట్రం సాల్ట్ లేక్ నగరానికి చెందిదన ఓ బ్యాంకులోకి ప్రవేశించిన డొనాల్డ్ శాంటాక్రాస్ అనే 65ఏళ్ల వ్యక్తి ఓ డాలర్ ఇవ్వాలని క్యాషియర్ ను బెదిరించాడు. క్యాషియర్ డాలర్ ఇచ్చి వెళ్లిపోవాలని సూచించగా.. తాను వెళ్లనని పోలీసులను పిలవనని సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులు రావడం లేట్ అయ్యే సరికి.. సిబ్బంది చాలా లక్కీ.. తన దగ్గర తుపాకీ లేకపోవడంతో తప్పించుకున్నారని తెలిపాడు. దీంతో అప్రమత్తమైన మేనేజర్ సిబ్బంది, కస్టమర్లను ఓ గదిలో పెట్టి తాళం వేశాడు. తర్వాత పోలీసులు వచ్చి డొనాల్డ్ ను అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు దోపిడికి వచ్చానని నేరం అంగీకరించాడు. తనను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జైలుకే తరలించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. రాష్ట్ర ప్రభుత్వంలోని జైలుకు తరలిస్తే విడుదలయ్యాక మళ్లీ బ్యాంకు దోపిడీకి దిగుతానని హెచ్చరించాడు. స్ట్రీట్ బెగ్గర్ గా జీవిస్తున్న నిందితుడు కూడు, గూడు కోసం జైలుకు వెళ్లేందుకే ఇలా చేసి ఉంటాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు నామినేషన్లు వేసిన BRS అభ్యర్థులు
Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్