ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం(Chigurupati Jayaram) హత్య కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి జీవితఖైదీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నాలుగేళ్లు విచారణ తర్వాత పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు శిక్ష ఖరారు చేసింది. కాగా 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాకేష్‌రెడ్డి(Rakesh Reddy), విశాల్, శ్రీనివాస్, రౌడీషీటర్ నగేష్ కీలక నిందితులుగా ఉన్నారు. జయరాం కేసులో 388 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.