34.2 C
Hyderabad
Monday, May 29, 2023

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు నామినేషన్లు వేసిన BRS అభ్యర్థులు

MLC Nominations |శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు వేశారు. కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉదయం 11 గంటలకు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్​లు వేయడానికి ముందు అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థులు నవీన్​ కుమార్​, చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్​లు నివాళులు అర్పించి అనంతరం నామినేషన్ వేశారు. అభ్యర్థుల నామినేషన్లుకు మంత్రులు హరీశ్​రావు, ప్రశాంత్​రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ హాజరయ్యారు. కాగా, ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్​ఎస్ అధిష్టానం ​ ప్రకటించింది.

శాసనమండలిలో ఈ ఏడాదితో గాంగాధర్​ గౌడ్​, నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతో వీరి కోటాలో ఎన్నికకు ఫిబ్రవరి 27 ఈరోజు నుంచి మార్చి 13 వరకు ఈ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నామినేషన్లను 14న పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరణకు ఈ నెల 16వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులలో మార్చి 23 న ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్​ నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ చేపట్టి అదే రోజు ఓట్ల లెక్కించనున్నారు.

Read Also: Naveen Murder Case |విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన నిహారిక

Follow us on:   Youtube   Instagram

Latest Articles

తుపాకీతో కాల్చేస్తా మాజీ మంత్రి చిన్నారెడ్డి వార్నింగ్

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో అధికారులు రహదారి విస్తరణ చేపట్టారు. విస్తరణలో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్