Free Porn
xbporn
23.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

యాదిలో…

మాజీ ప్రధాని,భారతరత్న అవార్డు గ్రహీత పీవీ నరసింహారావు 103వ జయంతి సందర్భంగా.. హనుమ కొండ జిల్లా వంగ రలో ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య.

మీ స్మృతిలో..

మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో పూల మాల వేసి నివాళులు అర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూధనా చారి.

నూతన కార్యాలయం

జనగామ జిల్లా పాలకుర్తిలో నూతన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా ఆఫీసును ప్రారంభించారు.

వ్యాధులపై ఫోకస్

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా శాంతినగర్, ఆశ్రా కాలనీలో పర్యటించారు. అన్ని వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ పనులను నిర్వహించాలని.. వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు.

జీతాలివ్వండి ప్లీజ్

మలక్‌పేటలో వికలాంగుల ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వికలాంగుల సహకార సంస్థలో మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే అధికారులు స్పందించి జీతాలు విడుదల చేయాలని కోరుతున్నారు.

దారుణం

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో దారుణం జరిగింది. మహీదర వెంచర్‌లో 8ఏళ్ల విశాల్‌ను కుక్కలు దాడి చేశాయి. దీంతో విశాల్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు విశాల్‌ కుటుంబం బీహార్‌ నుంచి వచ్చి జీవనం సాగిస్తున్నారు. మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అపరిశుభ్రంగా దర్శనం

యూసుఫ్ గూడ సర్కిల్-19 కార్యాలయంలో మరుగు దొడ్లు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. కార్యాల యంలో పారి శుద్ధ్య సిబ్బంది వాడే మరుగుదొడ్లతో పాటు మొదటి అంతస్తులో ఆస్తిపన్ను, పట్టణ ప్రణాళి క విభాగాల వాష్‌ రూమ్స్‌ శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో సిబ్బందితో పాటు వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.

సీపీఎం ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి సంతానగర్ రోడ్డు మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ధర్నా

హనుమకొండ జిల్లాలో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూలు విచ్చల విడిగా ఫీజులు దోపిడీ చేస్తున్నారంటూ.. DEO కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కూడా లేవని విమర్శించారు.

వైద్యుల నిర్లక్ష్యమే..

వైద్యుల నిర్లక్ష్యమే ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. ఆపదలో వచ్చిన వారికి చికిత్స అందించాల్సింది పోయి వారిలో భయం కల్పించి వైద్యం కోసం బేరసారాలు ఆడుతున్నారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం లోని ఓ ఆస్పత్రిలో ఆకాష్ గుప్తా అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతిచెందాడని బందువులు ఆరోపించారు.

రోడ్డు టెర్రర్

మెదక్ జిల్లా చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న నలుగురు మృతిచెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సేవలు మరువలేనివి..

పీవీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. పివీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు కాంగ్రెస్ నాయకులు. వీహెచ్, డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకు లు సంగిశెట్టి జగదీష్, అల్లం భాస్కర్, భవాని రెడ్డి, రాపోలు జయ ప్రకాష్, ప్రేమలత అగర్వాల్, లింగం యాదవ్ తదితరులు హాజరయ్యారు.

Latest Articles

ట్రెండింగ్‌లో సుధీర్ బాబు ‘హరోంహర’

సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’. యాక్షన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తోంది. ఏకంగా మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఈటీవీ విన్‌, ఆహాలతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్