టర్కీ పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. జైలులో ఉన్న ఎంపీపై టర్కీ పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ సమయంలో ఎంపీల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్ది సేపటికే తోపులాటగా మారింది. ఈ గొడవ తీవ్రం కావడంతో ఇద్దరు ఎంపీలు రక్తమోడారు. విపక్ష పార్టీకి చెందిన ఎంపీ అహ్మత్ సిక్ మాట్లాడుతుండగా.. ఈ ఘర్షణ చెలరేగింది. దీంతో అధికార పార్టీ ఎంపీలు ఆయనను చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. ప్రతిపక్ష ఎంపీ కూడా తనను తాను సమర్థించుకుంటూ అధికార పార్టీ ఎంపీలపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో అహ్మత్ మెడ, ముఖం నుండి రక్తం రావడం ప్రారంభమైంది. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.