తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమేనని, అసలు సంబరాలు రేపు తాము చేస్తామని చెప్పారు. కౌంటింగ్‌కు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, అందరిని అప్రమత్తం గా ఉండాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అలాగే కౌంటింగ్ పూర్తయ్యి డిక్లరేషన్ తీసుకునే వరకు ఎవరు కేంద్రాల నుంచి బయటకు రావద్దని చెప్పామన్నారు. అలాగే రేపు 11గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చామని తెలిపారు. దేశమంతా ఒక నిబంధనైతే, ఏపీలో మాత్రం మరో నిబంధన దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు కొట్టేసిన ఎన్నికల కమిషన్ చేసింది తప్పే నని అందరికీ తెలుసని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీలోనే నిబంధనలు మార్చారు – సజ్జల
0
195
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


