19.2 C
Hyderabad
Friday, January 17, 2025
spot_img

అనారోగ్యమే మహా శాపం…!

కాయకష్టం చేసే నిరుపేద కడుపు నిండా తినగలడు, కంటి నిండా నిద్ర పోగలడు. అయితే, సిరి సంపదలతో తులతూగే ధనవంతుడికి అన్ని ఉన్నా సుష్టుగా తినే యోగం, శుభ్రంగా నిద్రించే అవకాశం కరువే. ఉన్నవాడికి తింటే అరగదు, పట్టు పరుపులున్నా నిద్దుర పట్టదని..ఓ సినీ కవి తన గేయ రచనలో అన్నారు. లేనివాడు గంజినీళ్ల బువ్వ తిన్నా, హాయిగా ఆరోగ్యంగా ఉంటాడు, గరకు నేలపైనైన గురకలు తీస్తూ సుఖ నిద్ర పోతాడు. ఈ ఇద్దరిలో తేడా ఏమిటి అంటే.. అన్నీవున్న ధనవంతుడు ఏమీ తినలేడు, నిద్రకు నోచుకోడు. ఏమీ లేని నిరుపేద అన్నీ తినగలడు, హాయిగా పడుకోగలడు. అందుకే, పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతారు. హెల్త్ ఈజ్ వెల్త్.. ఓకే.. గుడ్ హెల్త్ అంటే ఏమిటి..? ఆరోగ్యకరమైన అలవాట్లు ఏమిటి..? మంచి ఆరోగ్యానికి పాటించాల్సిన చిట్కాలు ఏమిటి…? శారీరక, మానసిక ఆరోగ్యాలను ఎలా పరిరక్షించుకోవాలి..?

భాగ్యం అంటే ధనం. పుష్కలంగా ధనం ఉన్న ధనవంతుడు సర్వ సౌఖ్యవంతుడు, సర్వ శక్తిమంతుడు, సర్వ సమర్థుడు అని అందరూ అనుకుంటారు. అయితే, మహా భాగ్యం ధనం కాదు. పుష్కల ఆరోగ్యమే మహత్ భాగ్యం. కాలం కలిసి వస్తే నిరుపేద ఐశ్వర్యవంతుడు కావచ్చు. ప్రతికూల కాలం ఉంటే ధనవంతుడు నిరుపేద అవుతాడు. అయితే, సొమ్ము రావచ్చు, పోవచ్చు కాని ఆరోగ్యం కోల్పోతే తిరిగి రాదు. అనారోగ్యం దాపురిస్తే.. అన్నీ కోల్పోయినట్టే. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని, అసూయ, ద్వేషాలు దరిచేరకుండా అందరి మంచి, శ్రేయస్సు కోరుకుంటే, ఆ అందరిలో మనమూ ఉంటాం, మనమూ మంచిగా ఉంటాం. మంచి ఆరోగ్యంగాన్ని కలిగి ఉంటాం. మనిషి శరీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంటే… ఆ మహాభాగ్యం దేనితోనూ సరితూగదు.

రోగం రాకపోవడం, బలహీనత లేకపోవడం మాత్రమే ఆరోగ్యం కాదు. పూర్తి మానసిక, శారీరక, సామాజిక శ్రేయోదాయక స్థితి కలిగి అనారోగ్యాలు దరిచేరకుండా చూసుకునే వ్యక్తే సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా పరిగణింపబడతాడు. ఆరోగ్యకర జీవనశైలి మానసిక వికాసానికి దోహదపడుతుంది. శారీరక వ్యాధులకు చెక్ పెట్టడానికి సహకరిస్తుంది. అత్యుత్సాహం, అమిత విచారం ఏదైనా ఆరోగ్యభంగానికి కారణం కావచ్చు. గీతాచార్యుడు చెప్పినట్టు.. త్రికరణశుద్దిగా కర్తవ్య నిర్వహణలో నిమగ్నమవ్వాలి తప్ప…రాని దాని కోసం, లేని దాని కోసం అర్రులు చాచడం, ఉన్నదాన్ని అనాసక్తితో తృణీకరించడం కూడని పని. మానసిక ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటే అది ఆహ్లాదకరమైన మనస్సుకు దారితీస్తుంది.

ఆరోగ్యం అనేది వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. వ్యక్తికి సంబంధించి శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాలు ఉన్నా సమాజానికి సంబంధించి సామాజిక ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, వృత్తిపర ఆరోగ్యం, మేధో ఆరోగ్యం తదితర ఎన్నో ఆరోగ్యాలు ఉంటాయి. శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయో స్థితిని తెలిపే ఆరోగ్యం.. ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ల వల్ల అనారోగ్యంగా మారుతోంది. మానసిక ఆవేదన, శారీరక పరిరక్షణ పై అశ్రద్ధ వల్ల వ్యాధులు సంక్రమిస్తాయి. కొన్ని వంశపారంపర్య వ్యాధులు వస్తూంటాయి. పక్షవాతం, మధుమేహం, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు తదితర వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులుగా గుర్తిస్తాం. వేళకు తిండి, నిద్ర, మందులు తీసుకుని, ఒత్తిడికి దూరంగా ఉండి, వైద్యుల సలహా మేరకు వ్యాయామం చేస్తూ, మానసిక విశ్రాంతి పొందితే ఈ వ్యాధుల తీవ్రత తగ్గిపోతుంది.

శారీరక పరిరక్షణ విషయానికి వస్తే.. కాయగూరలు, ఆకు కూరలు, తాజా పండ్లను సమతుల్య ఆహారంగా తీసుకుంటే దేహదారుఢ్యం పెరుగుతుంది, అనారోగ్యాలు దూరం అవుతాయి. పోగాకు పోగాలానికి దగ్గరి చేస్తుంది అనే విషయం మరవకూడదు. పొగతాగడం హానికరం అని తెలిసినా, దానికి బానిసైన వారు ఆ జాడ్యం నుంచి బయటకు రాలేరు. అయితే, పట్టుదల వహించి.. నెమ్మది నెమ్మదిగా పొగతాగడాన్ని తగ్గిస్తూ…ఈ దురలవాటుకు దూరం అవ్వవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇదే రీతిలో మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలైనవారు, వాటి అనర్థాలను గ్రహంచి..వాటిని విడిచిపెట్టాలి.

ఒకవేళ ఏదైనా హానికరమైన వ్యాధి సోకితే.. ఆ హనికర సూక్ష్మజీవులను నిరోధించడానికి పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. సరైన ఆహారం, వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవడం అత్యావశ్యకం. ఇందుకు సంబంధించి సిఫారసు టీకాలు వేసుకోవాలి. ఇక ఇతరులకు సంక్రమించే వ్యాధులైతే.. మాస్క్ లు పెట్టుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కు, నోటికి కర్చిఫ్, టిష్యూతో కప్పుకోవాలి. చేతులను తరచు సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి. విస్తరించే నేత్రవ్యాధులు సంభవిస్తే.. తప్పక నల్లకళ్లజోడు వాడాలి. అనారోగ్యం ఉన్న వ్యక్తులతో .. ఆ వ్యాధి తగ్గేవరకు ఇతరులు సన్నిహిత సంబంధాలు నివారించుకోవాలి.

ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, తక్కువ కొవ్వు, చక్కెర కేలరీలతో కూడిన పోషకాహారాన్ని భుజించాలి. మల్టీవిటమిన్స్ తీసుకోవాలి. ఆరోగ్యవంతులుగా ఉంటే నీరు అధికంగా తీసుకోవాలి. అనారోగ్యాలకు గురైనవారు వైద్యుల సలహా మేరకు వీలైనంత మేర నీరు తాగాలి. ఉప్పు, చక్కెర పానీయాలు, తీపి పదార్థాలను పరిమితంగా వినియోగించడం ఉత్తమం. అమితాహారం కంటే అల్పాహారం, స్వల్పాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రొద్దుటే అల్పాహారం విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. బ్రేక్ ఫాస్ట్ వేరీ ఇంపార్టెంట్ అని ప్రతి వ్యైద్యుడు చెప్పడం మనకు తెలిసిందే. మనిషికి జీవితంలో అత్యంత విలువైన ఆస్తి మంచి ఆరోగ్యమే అనడంలో ఏ మాత్రం సంశయం లేదు.

———

Latest Articles

హోరా హోరీగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. నేటితో ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. నేటి సాయంత్రం 3 గంటలతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈసీ సమయం ఇచ్చింది. నామినేషన్లను ఈసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్