హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ కంప్లైంట్ రికార్డర్ “ఏఐ కాప్‌రైటర్”ను బంజారాహిల్స్‌లో సజ్జనార్ ఆవిష్కరించారు. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా 10కి పైగా భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్‌కు ఉంది. బాధితులు తమ మాతృభాషలో చెప్పిన ఫిర్యాదును వెంటనే టెక్స్ట్‌గా మార్చి అనువదిస్తుంది. హైదరాబాద్‌లోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, తప్పుల అవకాశాలను తగ్గించనుంది. ఫిర్యాదు వివరాలు, సమయం, అధికారుల సమాచారం పీడీఎఫ్ రూపంలో భద్రపరచబడుతుంది. ఈ యాప్‌ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థ సహకారంతో రూపొందించారు.
హైదరాబాద్ పోలీసుల కొత్త ఏఐ యాప్
0
120
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


