సింగరేణి కార్మిక సంఘానికి అందని గుర్తింపు పత్రం

    ఆ కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా అయిదు నెలలు అయ్యింది. అయినా, ఇప్పటి వరకూ గుర్తింపు సంఘం అనుమతి పత్రం అందలేదు. కొద్ది రోజులు ఎన్నికలు పేరుతో, మరి కొద్ది రోజులు కాలపరిమితి పేరుతో కాల యాపన చేశారు. గుర్తింపు ఇవ్వక పోతే సమస్యలపై చర్చలు ఎట్లా జరుగు తాయి. అసలు ఆ గుర్తింపు ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా మిత్ర సంఘం అయినా గుర్తింపు సంఘం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు పరేషాన్ అవుతు న్నాయి.

తెలంగాణ లో కీలకమైన పారిశ్రామిక సంస్థ సింగరేణి. సింగరేణి లో గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా అయిదు నెలలు అయింది. గుర్తింపు సంఘంకు ఎన్నికలు జరుగగానే ఎన్నికల్లో గెలిచిన సంస్థకు గుర్తింపు హోదా ఇస్తారు. ఇంత పెద్ద సంస్థ మరొక్కటి రాష్ర్టంలో లేదు. ఇక్కడ ఎన్నికలు కూడ సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా సాగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డైరెక్ట్ గా రంగ ప్రవేశం చేసి, తమ హంగులను ఉపయోగిస్తూ తమ అనుబంధ సంస్థలను గెలిపించుకునే కృషిలో కీలక పాత్ర పోషిస్తు న్నాయి. 2017 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీగా ఉన్న బిఆర్ఎస్ కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచింది. 2023 లో జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిచేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.2023 డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఐఎన్ టియుసి, ఏఐటియుసి అనుబంధ సంస్థలు పోటీ పడ్డాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలసి పోటీ చేసినా, ఈ ఎన్నికల్లో మాత్రం ఆ రెండు సంస్థలు వేర్వేరుగా పోటీచేశారు. కాని ఆ ఎన్నిక ల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఓటమి పాలై, సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసి గెలుపొందింది. ఇది జరిగి ఇప్పటికి 150 రోజులు అయ్యిం ది. అయిదు నెలలు అయినా గుర్తింపుసంఘం అయిన ఏఐటియు సికి ఇంతవరకూ గుర్తింపుసంఘం హోదాను కార్మిక శాఖ ఇవ్వలేదు. సింగరేణిలో ఎన్ని సంస్థలు ఉన్నా, గుర్తింపు సంఘానికి మాత్రమే చర్చల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. ఇప్పుడు ఆ అర్హత ఏఐటియుసికి వచ్చినా, సర్టిఫికేట్ మాత్రం ఇవ్వలేదు. అయితే డిసెంబర్ లో ఎన్నికల కోడ్ ఉన్నం దు వల్ల ఇవ్వలేదు. ఆ తరువాత ఎన్నికల కోడ్ ఎత్తి వేసినా సర్టిఫికేట్ ను కార్మిక శాఖ అందించ లేదు. ప్రస్తుతం ఎన్నిక ల కోడ్ ఉన్నా, ఈ ఎన్నికల కోడ్ కు ముందు నాలుగు నెలల పాటు ఎటువంటి కోడ్ లేదు . అయినా సర్టిఫికేట్ ను మాత్రం ఇవ్వలేదు.

గుర్తింపు సంఘ కాలపరిమితి రెండేళ్లు మాత్రమే అంటూ కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది . కానీ తమకు నాలుగేళ్ల కాలపరిమితి ఉన్నదంటూ సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘం అంటోంది. అయితే కేంద్ర స్థాయిలో ఏ కార్పొరేట్ కంపెనీ కి అయినా, రెండేళ్లు మాత్రమే గుర్దింపు ఉంటుందని కేంద్రం అంటుంది. కాని గెలిచిన కార్మిక సంఘం దానికి అంగీకరించడం లేదు. ఇప్పటి వరకూ ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కటి, రెండు సందర్భాల్లో తప్ప, నాలుగేళ్ల కాలపరిమితి ఉండేది. గతంలో మొదట ఏఐటియుసి గెలుపొందగా రెండేళ్లు ఉండగా ఆ తరువాత ఐఎన్ టియుసి గెలుపొందినప్పుడు ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్బాల్లో నాలుగేళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘం అనుభ వించింది. అయితే ఈసారి రెండేళ్లకు కుదించాల్సిందేనని కేంద్ర అంటుండగా దానికి గుర్తింపు కార్మిక సంఘం అంగీక రించడం లేదు. దీంతో గుర్తింపు కార్మిక సంఘానికి గుర్తింపు సర్టిపికేట్ అందడం లేదంట. దీంతో సమస్య లు చర్చించాలంటే కార్మిక సంఘానికి పెద్ద సమస్యగా మారుతోంది. గుర్తింపు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నుంచి రెండేళ్లు పరిగణిస్తారా.అన్నది మరో ప్రశ్న. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్