విచారణకు రావాల్సిందే.. నేను రాను.. తేల్చుకుందాం- ఎమ్మెల్సీ కవిత

స్వతంత్ర వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ ఈనెల 26వ తేదీని వాయిదా పడింది. అయితే, లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన అనంతరం.. వాయిదా వేసింది.  ఇక, విచారణ సందర్బంగా తదుపరి విచారణ వరకు ఈడీ సమన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ వాదనలు వినిపించింది. అంతగా కావాలంటే కవితకు 10 రోజులు సమయం ఇ‍స్తామని ఈడీ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం లేదా శనివారం విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కవిత కోర్టును ఆ‍శ్రయించారు. ఇదే సమయంలో తాను ఈడీ విచారణను రాలేనని అధికారులకు తెలిపారు. కోర్టులో తాడోపేడో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తాజాగా కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేయడంతో ఆమె.. రేపు ఈడీ విచారణకు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్