ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఎన్ కన్వెన్షన్‌కు జీహెచ్‌ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవని అన్నారు. చట్టప్రకారమే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశామని చెప్పారు. తమ్మిడికుంట చెరువు FTL, బఫర్‌జోన్లలోని ఆక్రమణలు కూల్చివేశారని రంగనాథ్ చెప్పారు. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చెప్పారు. బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని తెలిపారు.