ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణానికి రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. అమరావతి తో పాటు ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. లే అవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామన్న మంత్రి నారాయణ…నిబంధనలు ఉల్లంగించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.