37.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

రేవంత్ కు ఊహించని షాక్ …. రాజీనామా చేస్తా – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

   తెలంగాణలో జగిత్యాల కాంగ్రెస్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో హస్తం పార్టీలో ముసలం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే సంజయ్‌ చేరిక తో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. రాష్ట్ర అధిష్టనం పంపిన దూతల ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. తీవ్ర మనస్థాపంతో ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ భవిష్యత్ కార్యకరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది. జీవన్‌ రెడ్డి నిన్న రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు.అయితే, సోమావారమంతా జీవన్‌ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జీవన్‌ రెడ్డి ఇంటి వద్దకు చేరుకు న్నారు. కార్యకర్తలతో భేటీ సందర్భంగా జీవన్‌ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డితో చర్చలు జరిపారు. జీవన్‌ రెడ్డితో మంత్రి శ్రీధర్‌ బాబు చర్చలు జరిపినా ఫలించలేదు. ఈ క్రమంలో జీవన్‌ రెడ్డి, కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్‌ బాబు హామీ ఇచ్చారు.

   మరోవైపు జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఒక్కరోజు సమయం ఇచ్చినట్టు సమాచారం. లేకపోతే తాను రాజీనామా సిద్ధమని జీవన్‌ రెడ్డి తేల్చి చెప్పినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే, అధిష్టానం నుంచి జీవన్‌ రెడ్డికి హామీ దక్కకపోతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీవన్‌ రెడ్డి హైద రాబాద్‌కు చేరుకోవడంతో ఆయనకు మద్దతుగా జగిత్యాల నియోజకవర్గంలోని ఆయన మద్దతుదా రులు, కార్యకర్తలంతా ఇవాళ హైదరాబాద్‌ రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగు తున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసిం ది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చు కున్నారని ఆయన అన్నట్టు సమాచారం. జీవన్ రెడ్డి తదుపరి నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

ఢిల్లీలో ఖర్చు నియంత్రణకు కీలక నిర్ణయాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్

దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల వినియోగం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్