చైనాలో వంతెనను ఢీకొట్టిన భారీ రవాణా నౌక

      చైనాలో వంతెనను భారీ రవాణా నౌక ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గ్వాంగ్జూ నగరంలోని పెరల్‌ నదిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది. తెల్లవారుజామున ఈ నౌక ఫోష్‌మన్‌ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఉన్న లిజింగ్షా వంతెనను బలంగా ఢీకొంది. ఆ సమయంలో వంతెనపై ట్రాఫిక్‌ తక్కువగా ఉన్నట్లు అధికా రులు తెలిపారు. ఈ ఘటనలో ఒక బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు వ్యక్తు లు చనిపోగా.. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతైంది. ప్రమాదం అనంత రం ఈ నౌక వంతెన మధ్యే చిక్కుకు పోయింది. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్‌ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి కారణమైన నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్