బైజూస్‌ రవీంద్రన్‌పై ఈడీ లుకౌట్‌ నోటీసులు

    ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఆయనకు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశిం చింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది.

     ఇప్పటికే రవీంద్రన్‌పై ‘ఆన్‌ ఇంటిమేషన్‌ లుకౌట్‌ సర్క్యులర్‌’ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. బైజూస్‌ బ్రాండ్‌పై కార్యకలాపాలు నిర్వ హిస్తున్న థింక్‌ అండ్‌ లెర్న్‌ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదు ర్కొంటోంది. ఈ సంస్థ విలువ ఏడాది వ్యవధిలో లక్షా 82 వేల 600 కోట్ల నుంచి 16 వేల 600 కోట్లకు పడి పోయినట్లు పలు ప్రముఖ ఆర్థిక సంస్థలు అంచనా చేశాయి. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్య ల్లో ఉన్న ఈ కంపెనీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉంది. మరో వైపు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు అసాధారణ బోర్డు సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకోవాలని నిర్ణయించారు. అందుకోసం ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయా లని కంపెనీని కోరారు. వాటాదారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ బైజూస్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈజీఎం నిర్వహణకు అనుమతించింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు అమలు చేయొద్దని ఆదేశించింది.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్