ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి లేఖ రాయడం సంతోషకర పరిణా మమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్‌ను ఏపీలో కలిపారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పగించార న్నారు. ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు రప్పించడా నికి ప్రయత్నం చేయాలన్నారు. దీన్నే మొదటి ఎజెండాగా పెట్టాలన్నారు. ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతనే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్లాలని హరీష్ రావు అన్నారు. చంద్రబాబు అత్యంత శక్తి వంతుడని, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.