ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అతిషిని త్వరలోనే అరెస్టు చేస్తారని ఆయన అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
ఆప్ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చలేదని అన్నారు. దీంతో ఓ తప్పుడు కేసులో త్వరలో ముఖ్యమంత్రి అతిషిని ఆరెస్టు చేస్తారని తెలిపారు. అంతకంటే ముందు ఆప్ సీనియర్ నాయకుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారని తెలిపారు.