అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. వారిలో ఒక మహిళ సహా ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామానికి హరిత మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. హరితకు రెండు సంవత్సరాల క్రితం సత్యవేడు నియోజకవర్గలొని కాలంగి ఆధారం చెందిన సాయి అనే వ్యక్తితో వివాహం అయింది. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో తన కుమార్తె హరిత మృతిచెందగా తన అల్లుడు సాయి ప్రమాద స్థితిలో అమెరికాలో చికిత్స పొందుతున్నాడని తండ్రి భాస్కర్ రెడ్డి చెప్పారు.


