నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి IMD తెలిపింది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కృష్ణా, నంద్యాల, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురిశాయి. ములుగు, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఇవాళ కూడా హైదరాబాద్ నగరాన్ని దట్టమైన మేఘాలు కమ్మేసి ముసురు ముంచేస్తోంది. ఈ ప్రభావంతో నగరవాసులు బయటకు వెళ్లలేని పరిస్థిలులు నెలకొన్నాయి.