21.7 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

రూ.2 కోట్ల చెక్కులను దిల్ రాజుకు అందించిన అల్లు అరవింద్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్‌ను సినీ ప్రముఖులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ‘పుష్ప-2’ టీమ్ భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. శ్రీతేజ్‌ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్‌ను, ఆయన తండ్రిని పరామర్శించారు.

శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున కోటి, ‘పుష్ప-2’ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు రూపాయలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని..ఆయనకు వెంటిలేటర్ తీసేశారని వెల్లడించారు. 2 కోట్ల రూపాయల చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్