ఫార్ములా ఈ రేస్‌ కేసులో మరోసారి ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ-కారు రేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, BLN రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో, ఈ నెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు.

మూడు వారాల సమయం కావాలని అరవింద్ కుమార్, BLN రెడ్డి ఈడీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఈడీ.. రెండు వారాల సమయం కుదరదని చెప్పింది. ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని BLN రెడ్డికి మరోసారి ఈడీ.. నోటీసులు జారీ చేసింది. అలాగే… ఈనెల 9న అరవింద్‌ కుమార్‌ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో, వీరిద్దరూ విచారణకు హాజరవుతారా… లేదా… అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఈనెల 7వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్‌మెంట్‌ను కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు.

ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ కంటే ముందే ఏ2, ఏ3 అయిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ, అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. దీంతో.. ఈడీ అధికారులు ముందుగా కేటీఆర్‌నే విచారించాల్సి వస్తోంది.

Latest Articles

మాన్వీ బయటే ఉండు.. ఆత్మహత్యకు ముందు కూతురికి నోట్‌ రాసిన గుజరాత్‌కు చెందిన వ్యక్తి

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కూడా తన కుటుంబ భద్రత గురించి ఆలోచించాడు. ఇంట్లోకి రావొద్దని హెచ్చరిస్తూ పేపర్‌ మీద రాసి ఉన్న మెసేజ్‌ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్