డ్రైవింగ్ లైసెన్స్ …. సవరించిన రూల్స్

ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొత్త విషయం చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబందించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచే అమలులోకి వస్తాయి.

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ నిబంధనలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావచ్చు. నూతన నిబంధనల ప్రకారం మీరు ఇకపై ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా.. ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి ఓ సర్టిఫికేట్ ఇస్తారు. దాంతో ఆర్‌టీఓ ఆఫీసు ద్వారా లైసెన్స్ పొందవచ్చు. ఈ కొత్త నిబంధనల ముఖ్యఉద్దేశం నేరుగా ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడం.. పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయడం. దీని ద్వారా సమయం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు పెట్టింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఫోర్ వీలర్ శిక్షణ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలని తెలిపింది. అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది. అదేవిధంగా అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హైస్కూల్ డిప్లామా అర్హత తప్పనిసరి చేసింది కేంద్రం. కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలని నొక్కి చెప్పింది. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపింది. ప్రతి ఒక్క అభ్యర్థి లైసెన్స్ పొందడానికి లైట్ మోటార్ వెహికల్ శిక్షణ 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలని వివరించింది. అలాగే ఈ శిక్షణ రెండు విభాగాలుగా ఉండాలి.. థియరీ కోసం 8 గంటలు, ప్రాక్టికల్ కోసం 21 గంటలు కనీసం కేటాయించాల్సి ఉంది. హెవీ మోటార్ వెహికల్స్ అయితే 38 గంటల కనీస శిక్షణ.. 8 గంటలు థియరీ ఎడ్యుకేషన్, 31 గంటలు ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. కొత్తగా లైసెన్స్ తీసుకునేందుకు యత్నించేవాళ్లు ఈ నిబంధనలు దృష్టిలో ఉంచుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఫీజుల్లో కూడా కేంద్రం గణనీయమైన మార్పులు చేసింది.ఇన్నాళ్లు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లి అక్కడున్న బ్రోకర్స్ ఉచ్చులో పడి ఎంతో డబ్బు పోగొట్టుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఈ కొత్త మార్పులు ఒకింత అందరికీ మేలు చేకూరే లాగే ఉంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్