స్వతంత్ర వెబ్ డెస్క్: భారతీయ సంస్కృతిలో భాగమైన దీపావళి పండగను సెలవు దినంగా ప్రకటించిలని అగ్ర దేశం అమెరికాలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన గ్రేస్ మెంగ్ అనే సభ్యురాలు చట్టసభలో బిల్లును ప్రవేశ పెట్టారు. అంతేకాదు ఈ ప్రతిపాదనకు భారతీయ కమ్యూనిటితో సహా వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన కూడా లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివాళీ డే యాక్ట్‌ను సభలో ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందని.. విభిన్న సంస్కృతులకు ప్రభుత్వం ఇచ్చే విలువను ఈ నిర్ణయం చాటుతుంది’ అని మెంగ్ తన బిల్లులో పేర్కొన్నారు. దీపావళి పండగ రోజును ఫెడరల్ హాలిడేగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘దీపావళి డే యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును అమెరికా వ్యాప్తంగా పలు కమ్యూనిటీలు స్వాగతించాయి. ‘దీపావళిని రోజున ఫెడరల్ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటిస్తే.. కుటుంబాలు కలిసి వేడుకలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఈ బిల్లు తొలుత పార్లమెంట్ లో పాస్ అయినా అనంతరం అధ్యక్షుడు బైడెన్ సంతకంతో బిల్లుకి ఆమోద ముద్ర పడుతుంది. ఈ బిల్లుపై చట్టసభ్యులు, అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ ప్రకటించారు. ఈ సంవత్సరం దీపావళి పండగను ఫెడరల్ హాలిడేగా జరుపుకొందామని అన్నారు. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా దేశస్థులు అనుసరించే సంస్కతి, సంప్రదాయాలను గౌరవించుకున్నట్టవుతుందని వ్యాఖ్యానించారు.
ఈ బిల్లు యూఎస్ కాంగ్రెస్‌లో ఆమోదం పొంది.. అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత అగ్రరాజ్యంలో దీపావళి పర్వదినాన సెలవు దినంగా ప్రకటించేందుకు వీలు కలుగుతుంది. అదే జరిగితే అమెరికాలో ఫెడరల్ గుర్తింపు పొందిన 12వ సెలవుగా దీపావళి నిలవనుంది.