అభిమాన థియేటర్ పిక్చర్స్ నిర్మించిన ‘కొంచెం హట్కే’ చిత్రంలోని ‘బదులేంటి ప్రశ్నేనా’ అంటూ సాగే మొదటి పాటని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ చిత్రానికి కే.ఎం.రాధాకృష్ణ సంగీతాన్ని అందించారు. ఆనంద్, గోదావరి,చందమామ వంటి అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ తర్వాత ‘కొంచెం హట్కే’ చిత్రంతో విభిన్నమైన సంగీతంతో మన ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘‘చాలా కాలం తర్వాత కే.ఎం.రాధాకృష్ణ పాట విన్నాను. చాలా బాగుంది. కొత్త వాళ్లతో చేశామని టీం చెప్తున్నారు. కొత్త వాళ్లతో చేసినప్పుడు ఉండే కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అభినందించారు. ఈ పాటకి సాహిత్యం అందించింది శ్రీనివాస మౌలి, గానం : మనీషా ఈరబత్తిని. దర్శకుడు: అవినాష్ కుమార్, రచయిత: కృష్ణా రావూరి, కెమెరా : అనీల్ మల్లెల, ఎడిటర్ : మంజు కె రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : నవ్య పోట్ల
Konchem Hatke : ఆ కష్టాలు నాకు తెలుసు: డైరెక్టర్ శేఖర్ కమ్ముల
0
450
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


