గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ విఘ్ననాథుడి శోభా యాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు నిర్వహించారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీ దశ మహా విద్యా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఎప్పుడూ చివరగా తరలివెళ్లే ఖైరతాబాద్ మహా వినాయకుడ్ని ఈసారి ముందుగానే నిమజ్జనం చేశారు.

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్