డిసెంబర్‌ 31 వివాదం.. జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌, సినీ నటి మాధవీలత మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అప్పుడెప్పుడో జనవరి 1న మొదలైన వివాదం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. తనపై చేసిన వ్యాఖ్యలకు మాధవీలత జేసీ ప్రభాకర్‌పై సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని.. సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేశారని మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌పై సైబరాబాద్‌ సీసీఎస్‌లో కేసు నమోదైంది.

జేసీ ప్రభాకర్‌ పై బీఎన్‌ఎస్‌ 352, 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. జేసీ వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ మాధవీలత ఫిర్యాదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నమోదు చేశారు. మాధవీలత, జేసీ మధ్య డిసెంబర్‌ 31 పార్టీ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.

కొత్త సంవత్సరం పురస్కరించుకుని తాడిపత్రిలో డిసెంబర్‌ 31న అర్ధరాత్రి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు జేసీ ప్రభాకర్‌ . అయితే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నందున మహిళలు జాగ్రత్తగా ఉండాలని మాధవీలత హెచ్చరించారు.

బీజేపీ నాయకురాలైన మాధవీలత కామెంట్స్‌ తో జేసీ మనస్తాపం చెందారు. ఆమె వ్యాఖ్యలకు కౌంటరిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సినీ నటిని వ్యభిచారిగా అభివర్ణిస్తూ కామెంట్స్‌ చేశారు. జేసీ కామెంట్స్‌పై విమర్శలు ఎదురవడంతో ఆయన మాధవీలతకు క్షమాపణ చెప్పారు.

కానీ తనను జేసీ ప్రభాకర్‌ అనుచరులు బెదిరిస్తున్నారని… సోషల్‌ మీడియాలో వేధిస్తున్నారని మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు జేసీ ప్రభాకర్‌పై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ కేసు నిలబడుతుందా.. జేసీ ప్రభాకర్‌పై చర్యలు తీసుకుంటారా.. వేచి చూడాలి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్