డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసుకుంది చిత్ర బృందం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అనంతపురంలో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందడంతో ఈవెంట్‌ని హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ రద్దు చేసుకున్నారు.
ఎన్నికల అనంతరం బాలకృష్ణకు తొలి సినిమా ఈవెంట్ ఇదే కావడంతో ఘనంగా నిర్వహించాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్ హాజరుకావాల్సి ఉంది. తిరుపతి ఘటనతో ఆయన వచ్చే అవకాశం లేకపోవడంతో సినిమా యూనిట్ డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసుకుంది. హీరోగా బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సంక్రాంతి రేసులో ఈ నెల 12న విడుదల కానుంది.