23.7 C
Hyderabad
Sunday, July 14, 2024
spot_img

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్

   ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఫలితాలపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ నడుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్నికల సంఘం కూడా కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలుకానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లు గెలుపు ధీమా వ్యక్తపరిచిన అభ్యర్థుల గుండెలు లబ్‌డబ్‌. లబ్‌డబ్‌ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి. బరిలో నిలిచేవారే కాదు. తమ అనుచరులు పార్టీ కార్యకర్తలదీ అదే పరిస్థితి. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివిధ సర్వే సంస్థలు ప్రకటించాయి. కొన్ని సంస్థలు కూటమిదే అంధికారం అంటూ ప్రకటించగా.. మరికొన్ని వైసీపీకే పట్టం అంటూ అంచనా వేశాయి. దాంతో అధికారం ఎవరికి దక్కుతుంది అన్నది ఉత్కంఠగా మారింది.

   ఏపీలో ఓట్ల లెక్కింపనకు సంబంధించి, అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ల లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించు కునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పించాలని సూచించారు.

   సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటలకు ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 2-3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే, వీవీ ప్యాట్‌ల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు.

   రాష్ట్రవ్యాప్తంగా 175 శాసన సభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఇక, ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. వారు ఏ టేబుల్‌ దగ్గర ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు తెలపనున్నారు. ట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూంలను ఓపెన్ చేయనున్నారు. వాటిలోని ఈవీఎంలను లెక్కించి టేబుళ్లపైకి తీసుకు వెళ్లనున్నారు.ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంని భావిస్తున్న పోలీసులు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

   కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయ్యింది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో మరింత కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కేంద్రం నుంచి కూడా అదనపు బలగాలు ఏపీకి వచ్చాయి. కౌంటింగ్ కోసం రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరించారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ పెట్టారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర గుమికూడకూడదు. పల్నాడు, అనంతపురం, కడప ఎక్కడెక్కడ అయితే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేత లు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించోద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Latest Articles

ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు ఆర్ కృష్ణయ్య పిలుపు

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ.. ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్