స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ప్రయాణికులతో ఉన్న ఏడు బోగీలు పల్టీకొట్టాయి. దీంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 50మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బాలాసోర్‌కు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న బహనాగ్ రైల్వేస్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. ఏడు బోగీలు బోల్తా
0
422
Previous article
Latest Articles
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -
- Advertisement -


